ఘనంగా అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలు
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలు పొదిలిలో ఘనంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే అఖిలేష్ యాదవ్ 47వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద కేకును కోసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాయతీ కార్మికులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి కార్మికులకు భోజనాలను వడ్డించారు.
ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారావు, జిల్లా కార్యదర్శి మురబోయిన బాబూరావులు మాట్లాడుతూ అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని….. ఈ సందర్భంగా కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని….. ముఖ్యమంత్రిగా సమర్ధవంతంగా తన బాధ్యతలను నిర్వహించిన ప్రస్తుత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భావి ప్రధానిగా ఎదగాలని ఆకాంక్షించారు.