ఘనంగా ఇందిరాగాంధీ 101 జయంతి వేడుకలు
పొదిలిలోని స్థానిక పెద్దబస్టాండ్ సెంటర్ నందు ఇందిరాగాంధీ 101 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సైదా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పెద్ద బస్టాండ్ లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సైదా మాట్లాడుతూ మన దేశ మాజీ ప్రధాని అయిన ఇందిరాగాంధీ తన తుదిశ్వాస వరకు పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా పేదరికం అనేది లేకుండా ఉండాలనే కాంక్షతో సేవ చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని అన్నారు. అనంతరం పొదిలి మండల కాంగ్రెస్ పార్టీ కోశాధికారి భూమా రవి అల్పాహార పంపిణీ చేశారు