ఘనంగా పొట్టిశ్రీరాములు జయంతి వేడుకలు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సాధకుడు అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్ధానిక అమ్మవారిశాల గల పొట్టి శ్రీరాములు విగ్రహం కు పూలమాలు వేసారు అనంతరం స్ధానిక పంచాయతీ కార్యలయం వద్ద ఉన్న పొట్టిశ్రీరాములు గాంధి విగ్రహాలకు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గునుపూడి భాస్కర్, వాసవి క్లబ్ జిల్లా క్యాబినెట్ ట్రెజరర్ సోమిశెట్టి శ్రీదేవి గారు ఆర్ సి రామసుధాకర్ లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గునుపూడి భాస్కర్ మాట్లాడుతూ త్యాగానికి మారుపేరు,రాష్ట్ర సాధకుడు అయిన పొట్టి శ్రీరాములు మనకు స్ఫూర్తి దాతనిఅన్నారు పొట్టిశ్రీరాములు స్ఫూర్తి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసి సాధించుకోవలని అదేవిధంగా ఇటీవల బడ్జెట్ లో ఆర్యవైశ్యలు సంక్షేమం కోసం 30 కోట్లు కేటాయించడం సంతోషం దీనికి కృషిచేసి 130 కోట్ల వరకు పెంచేలా చూస్తానని భరోసా ఇచ్చిన మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు గారికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కొత్తురి చెంచు నారయణ గునుపూడి చెంచు సుబ్బారావు వాసవి క్లబ్ రావూరిప్రసాద్ ప్రవీణ్ మురళి కృష్ణ యూత్ క్లబ్ జియస్ఆర్ హర్ష గౌతమ్ అరుణ్ రవి కపుల్స్ క్లబ్ మేడ నరసింహారావు సత్యం,జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి వేమ కృష్ణ రావూరిసుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.