గాండ్ల కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హర్షం.
ప్రకాశంజిల్లా గాండ్ల సంఘం ఆధ్వర్యంలో గాండ్ల కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే స్థానిక ఎన్జీవో భవనం నందు ప్రకాశంజిల్లా గాండ్ల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన జయహో బిసి సదస్సులో గాండ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. అలాగే త్వరగా ఈ కార్పొరేషన్ కు చట్టబద్ధత కల్పించాలని కోరారు. అలాగే గాండ్లను గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించిన చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాండ్ల సంఘం జిల్లా నాయకులు చిట్టెంశెట్టి వెంకట సుబ్బారావు, వరికుంట హనుమంతరావు, బి సహదేవుడు, మండల నాయకులు చిట్టెంశెట్టి వెంకట కృష్ణారావు, దాసరి గురుస్వామి, బట్టు రామారావు, బట్టు పిచ్చయ్య, హరిప్రసాద్, గుంటిక కృష్ణ తదితరులు పాల్గొన్నారు.