ఘనంగా అఖిల గాండ్ల తెలికుల ఆత్మీయ సమ్మేళనం

అఖిల భారత గాండ్ల తెలికుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నాడు స్థానిక పొదిలి మహర్షి ఉన్నత పాఠశాల నందు దాసరి గురుస్వామి అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన తంగెళ్ల నాగభూషణం మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన గాండ్ల కుల సభ్యులకు విద్య మరియు ఉపాధి అవకాశాలు కల్పించాలని, గానుగ కులవృత్తి మరియు ఇతర వృత్తులు చేసుకొనే వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గాని లేదా గాండ్ల కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేసి గాండ్ల సామాజిక వర్గం యొక్క అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దాసరి గురుస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో 35 లక్షల మంది జనాభా కలిగిన గాండ్ల సామాజికవర్గానికి నామినేటెడ్ పదవులు కల్పించాలని దాసరి గురు స్వామి కోరారు.

ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు తంగెళ్ల నాగభూషణం పర్యవేక్షణలో పొదిలి యూనిట్ కు నూతన కార్యవర్గం ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

అధ్యక్షులుగా చిట్టెంశెట్టి వెంకట కృష్ణారావు, ప్రధాన కార్యదర్శిగా దాసరి గురుస్వామి, కోశాధికారిగా ఏరువ వెంకటరామయ్య, ఉపాధ్యక్షులుగా వరికుంట్ల వెంకటేశ్వర్లు, దుడ్డు శ్రీనివాసులు, వరికుంట్ల నాగమల్లేశ్వరరావు,
కార్యనిర్వాహక కార్యదర్శిగా బూదాటి నిమ్మేశ్వరరావు, వరికుంట్ల హరిబాబు, చిట్టెం శెట్టి శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షులుగా దుడ్డు హరిప్రసాద్, చిట్టెంశెట్టి వెంకట సుబ్బారావు
గౌరవ సలహాదారులుగా బట్టు రామారావు, దుడ్డు శంకర్, బట్టు పిచ్చయ్య, గుంట కృష్ణ , యువజన కార్యవర్గ సభ్యులుగా చిట్టెంశెట్టి అనూష మరియు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వరికుంట్ల వెంకటేశ్వర్లు, చిట్టెంశెట్టి శ్రీనివాసులు, ఊటుకూరి ప్రసాదు, వరికుంట్ల హనుమంతరావు జె వి శేషయ్య, బట్టు పిచ్చయ్య, రోషన్ బాబు, గుంటిక కృష్ణ తదితరులు పాల్గొన్నారు.