పవిత్ర గంగా హారతి తిలకించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
ఉత్తరాఖండ్ : హరిద్వార్ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఈ ఉదయం జరిగిన పవిత్ర గంగా హారతిలో పాల్గొన్న గంగా ప్రక్షాళనకు పవన్ తన మద్దతు ప్రకటించారు.
ప్రజల నమ్మకాలు, విశ్వాసాలు, సంస్కృతిని పరిరక్షించేందుకు గంగానది కాలుష్యానికి గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యలు తదితర అంశాలపై స్థానికులతో చర్చించారు.
హారతి పూర్తయ్యేంత వరకు తిలకించిన పవన్ తో మాత్రిసధన్ ఆశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ గంగానది ప్రక్షాళన కోసం దక్షిణాది రాష్ట్రాలు పెద్దగా మద్దతు ఇవ్వడం లేదని… మీరు ఆ లోటు భర్తీ చేయాలని కోరారు.