ఫైబర్ గ్యాస్ వాడకం పై అవగాహన సదస్సు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఫైబర్ గ్యాస్ వాడకం పై అవగాహన సదస్సును సోమవారం నాడు స్థానిక పొదిలి కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం నందు కరుణా ఇండియన్ గ్యాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాశం జిల్లా ఇండియన్ గ్యాస్ డిప్యూటీ మేనేజర్ దుగ్గినేని భాస్కర్ రావు మాట్లాడుతూ నూతనంగా ప్రవేశపెట్టిన ఫైబర్ గ్యాస్ సిలిండర్ల,5 కేజీల సిలిండర్లు వాటి ఉపయోగాలు, గ్యాస్ వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులు సాయి రాజేశ్వరరావు, కరుణ ఇండియన్ గ్యాస్ సిబ్బంది , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.