కంభలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ల్ బోల్తా 20 గాయాలు ఒక్కరు మృతి

నిర్లక్ష్యంగా వ్యవహరించిన బెల్లంకొండ విద్యాసంస్థ పై క్రిమినల్ కేసు నమోదు
సిఐ సుధాకర్

పరిస్థితి విషమంగా ఉన్న ఏడుగురిని ఒంగోలు తరలింపు

ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంభాలపాడు గ్రామం సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి ఒకరి మృతి చెందింది20మంది గాయపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.

స్థానిక పొదిలి మండలం కంబాలపాడు గ్రామంలోని బెల్లంకొండ విద్యాసంస్థలు చెందిన అగ్రికల్చల్ పాలిటెక్నిక్ చెందిన విద్యార్థులు కొనకనమీట్ల మండలం చిన్నరికట్ల గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రం పోయి తిరిగి ట్రాక్టర్ లో కంబాలపాడు వస్తున్న క్రమంలో కంబాలపాడు బ్రిడ్జి సమీపంలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న బెల్లంకొండ విద్యా సంస్థకు చెందిన సుమారు 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడటంతో మార్గంమధ్యలో ఒంగోలు వెళ్తున్న బేస్తవారిపేట మండల పరిషత్ అధ్యక్షులు ఓసుర్ రెడ్డి తన తన వాహనంలో లోపు పరిస్థితి విషమంగా ఉన్న కొంతమందిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మరి కొంతమందిని స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు మరి కొంతమందిని 108 వాహనం ద్వారా పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

వైద్యశాలకి తీసుకురాగానే శ్రీకాకుళం జిల్లా చెందిన చిన్న కోటేశ్వరమ్మ అనే విద్యార్థిని మృతి చెందగా మరో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు కు తరలించారు.

విషయం తెలుసుకున్న పొదిలి సిఐ సుధాకర్ రావు స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని యుద్ధ ప్రాతిపదికన గాయపడినవారిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు కు తరలించారు.

ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యా సంస్థ పై మరియు ట్రాక్టర్ ఓనర్ మరియు డ్రైవర్ పై కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు