పౌరసరఫరాల శాఖ గిడ్డంగి ప్రారంభించిన…. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రామకృష్ణారెడ్డి
స్థానిక మార్కాపురం అడ్డరోడ్డులో నూతనంగా నిర్మించిన పౌరసరఫరాల శాఖ గిడ్డంగిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే పౌరసరఫరాల శాఖ గిడ్డంగి నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి, మరియు రాష్ట్ర అటవీశాఖ చైర్మన్ దివి శివరాంలకు రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో బైకు ర్యాలీ గోదాము వద్దకు చేరుకోగానే అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తొలుత భవన నిర్మాణ శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించి భవనాన్ని పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, జడ్పీటీసీ సాయి రాజేశ్వరావు, ఎంపిపి కోవెలకుంట్ల నరసింహరావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్ శివపార్వతి, డిప్యూటీ తహశీల్దార్ జానీ బేగ్, మండల పౌరసరఫరాల సంస్థ అధికారులు, పొదిలి కొనకనమిట్ల మర్రిపూడి డీలర్లు తదితరులు పాల్గొన్నారు.