హైస్కూల్ కు మైక్ సెట్ బహుకరణ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు హబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరిముల్లా బిగ్ మైక్ సెట్ ను అందజేశారు.

 

మంగళవారం నాడు స్థానిక పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు జరిగిన మార్కాపురం నియోజకవర్గం స్థాయి ఉత్తమ మేధో సంపత్తి కల్గిన విద్యార్థులను తీర్చిదిద్దడంలో భాగం నిర్వహించిన విద్యార్థుల సదస్సులో శాసనసభ్యులు చేతుల మీదుగా మైక్ సెట్ ను అందజేసి విద్యార్థులకు భోజనం వసతిని హబీబుల్లా ఫౌండేషన్ కల్పించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ సుధాకర్ రావు, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈవి రంగయ్య మరియు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు