నాటు సారా తయారుదారులకు బెల్లం అమ్మకుడుదు: డియస్పీ నారాయణ స్వామి రెడ్డి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
నాటు సారా తయారుదారులకు బెల్లం అమ్మకుడుదని దరిశి డియస్పీ నారాయణ స్వామి రెడ్డి అన్నారు.
శనివారం నాడు స్థానిక పొదిలి పోలీసు స్టేషన్ నందు యస్ఐ శ్రీహరి అధ్యక్షతనతో వ్యాపారస్తులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన దరిశి డియస్పీ నారాయణ స్వామి రెడ్డి మాట్లాడుతూ వ్యాపారస్తులు బెల్లం అమ్మకాలు సంబంధించి రికార్డులు తయారు చెయ్యాలని ప్రతి అమ్మకాలు సంబంధించి ఖచ్చితంగా రికార్డు నమోదు చేసి నాటు సారా నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో పొదిలి సిఐ సుధాకర్ రావు మరియు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు