విద్యుత్ షాక్ తో బాలిక మృతి
పొదిలి పట్టణంలోని విశ్వనాధపురం పవర్ స్టేషన్ వెనుక వైపు నివాసం ఉంటున్న బొమ్ము శ్రీనివాసరెడ్డి కూతురు మోనా ట్విన్కిల్ రెడ్డి(15) ఇంటిలోని టేబుల్ ప్యాన్ ప్లగ్ ను పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వెనుకకు పడడంతో తలకు బలమైన గాయమైంది.
మోనాను కాపాడబోయే ప్రయత్నంలో తండ్రి శ్రీనివాస్ రెడ్డి కూడా స్వల్పంగా గాయపడడంతో హుటహుటిన పొదిలి ప్రభుత్వ వైద్యశాల తరలించగా అప్పటికే మోనా ట్విన్కిల్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
విషయం తెలుసుకున్న పొదిలి ఎస్ఐ సురేష్ ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.