ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు పాఠశాలలు

గతంలో వచ్చిన కథనాలను స్పందించి ఎంఈఓ తనిఖీలు చేసినా కూడా కనిపించని ఫలితం

షోకాజ్ నోటీసులకు సైతం లెక్కచేయని పాఠశాలలు
ఏమైతే మాకేంటి అంటున్న రెండు పాఠశాలలు
ప్రభుత్వ సెలవు దినం అయిన ఆ విద్యా సంస్థలు తేరిచే ఉంటాయి

గత బుధవారంపత్రికలలో వచ్చిన కథనం మేరకు మండల విద్యాశాఖ అధికారి స్పందించి పొదిలి మండలం లొ ని పదమూడు విద్యాసంస్థలు ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ప్రభుత్వం నిబంధనల కు విరుద్ధంగా రెండూ పూటల విద్యాసంస్థల ను నిర్వహించటం పై మండిపడ్డారు తరువాత పదమూడు పాఠశాలలకు షోకాజ్ నొటీసులు పంపారు ఈ క్రమంలో మరుసటి రోజు నుండి పదకొండు విద్యాసంస్థలు ఒంటి పూట బడి ఇవ్వగా దానికి విరుద్ధంగా రెండు విద్యాసంస్థలు గీతాంజలి మరియు ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీషు మీడియం స్కూల్ మాత్రం ప్రభుత్వ నిబంధనలను మండల విద్యాశాఖ అధికారి నొటీసులు ను సైతం లెక్క చేయకుండా పిల్లలను ఎండకు సైతం నిర్బంధించి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు

వివరాల్లోకి వెళితే……. అసలే ఎండాకాలం తీవ్రమైన ఎండల కారణంగా విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మార్చి 15వ తేదీ నుండి ఒంటిపూట బడులు నిర్వహిచమని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది……. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ పత్రికలలో ప్రచురితం అవ్వడంతో పొదిలి మండల విద్యాశాఖాధికారి ఈ నెల 4వ తేదీన అన్ని ప్రైవేటు పాఠశాలలో తనిఖీలు నిర్వహించి రెండు పూటలా నిర్వహిస్తున్న పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు….. నోటీసులకు కట్టుబడి అందరూ పాఠశాలలను ఒక్కపూట మాత్రమే నడుపుతుండగా రెండు పాఠశాలలు( గీతాంజలి మరియు ఆక్స్ ఫర్డ్ ) మాత్రం ఏం చేసినా మావైఖరి మార్చుకోమంటూ ఎంచక్కా రెండు పూటలా బడులు నడుపుతున్నారు….. మిగతా యాజమాన్యాలు మాత్రం నిబంధనలు మాకేనా వారికి వర్తించవా అని ప్రశ్నిస్తుండగా తల్లిదండ్రులు ఇంత ఎండల్లో కూడా రెండు పూటలా పాఠశాలలు ఏంటంటూ గగ్గోలు పెడుతున్నారు…..ఎల్ కె జీ పిల్లల దగ్గర నుండి తొమ్మిదవ తరగతి వరకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఏమి కాదు కదా వాళ్ళని ఎందుకు ఒంటిపూట బడుల నేపధ్యంలో రెండవపూట కూడా ఉంచాల్సిన పనేంటి అంటూ ప్రజలు విస్తుపోతున్నారు….. ఈ ప్రైవేటు పాఠశాలల తీరు మరేదెప్పుడో చూడాలి మరి !