ఘనంగా రామానుజన్ జయంతి వేడుకలు

రామానుజన్ జయంతి సందర్భంగా స్థానిక పొదిలి బాలికల ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన గణిత నమూనాల ప్రయోగశాలన సీనియర్ సిటిజన్ మాకినేని రమణయ్య ప్రారంభించారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనువాసులు మాట్లాడుతూ ఈరోజు 134వ రామానుజన్ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నామని,భారత గణిత శాస్త్ర నిపుణుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన దేశ వ్యాప్తంగా జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని ఆయన తమిళనాడు రాష్ట్రంలో 1887 డిసెంబర్ 22వ తేదీన ఈ రోడ్ ప్రాంతంలో అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో శ్రీనివాస రామానుజన్ జన్మించారని శ్రీనివాస రామానుజన్ కేవలం 32 సంవత్సరాలుకాలంలోనే సంఖ్యా సిద్ధాంతం అనంత శ్రేణులు కలిగి ఉన్న గణితం కోసం చాలా కృషి చేశారని అన్నారు.

శ్రీనివాస రామానుజన్ 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 2012 సంవత్సరంలో డిసెంబర్ 22 వ తేదీ ని జాతీయ గణిత దినోత్సవం గా ప్రకటించింది నాటి నుండి ప్రతి సంవత్సరం రామానుజన్ జన్మదినం గణిత దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు.

అనంతరం ప్రయోగశాల నందు ఉత్తమ ప్రతిభ చూపిన వారికి బహుమతులను ప్రధానం చేశారు

ఈ కార్యక్రమంలో ‌పాఠశాల అభివృద్ధి కమిటీ సలహాదారులు కల్లం వెంకట సుబ్బారెడ్డి, మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు