ఘనంగా యుటియఫ్ ఆవిర్భావం దినోత్సవం వేడుకలు

ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావం దినోత్సవం వేడుకలు పొదిలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు స్థానిక యుటియఫ్ కార్యాలయం నందు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 48వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా. సంస్థ జెండాను వి యస్ కె రాజేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 1974లో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఉపాద్యాయులు హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తూ అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి డిమాండ్ సాధించిన గొప్ప చరిత్ర కల్గిన సంస్థ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్ హై జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు బి. బుజ్జి బాబు కుటుంబ సంక్షేమ డైరెక్టర్ చవళం వెంకటేశ్వర్లు పొదిలి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాల కాశి రెడ్డి ఎం.నాగార్జున రావు కొనకనమిట్ల అధ్యక్షులు చంద్రమౌళి కోశాధికారి వై హరిబాబు పి శ్రీనివాస్ రెడ్డి ,జి రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు