ఘనంగా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ వేడుకలు

ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా పొదిలి ని తయారు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ యు సుధాకర్ రావు అన్నారు

ఆదివారం నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జనవిజ్ఞాన వేదిక పొదిలి డివిజన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి గురుస్వామి అధ్యక్షతన పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పొదిలి సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ రేపటి తరాల భవిష్యత్తుకు పర్యావరణ పరిరక్షణ బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.

అనంతరం జూనియర్ కళాశాల మైదానంలో మొక్కలు నాటి లక్షల రూపాయలు ఖర్చుపెట్టి వాటిని పెంచి గత రెండు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన వాకర్స్ అసోసియేషన్ పూర్వపు సభ్యులను, ప్రస్తుత సభ్యులను సి ఐ సుధాకర్ రావు అభినందించారు

ఈ సందర్భంగా దాసరి గురుస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ సంచులను వాడకుండా గుడ్డ సంచులు వాడాలని, ప్రతి ఇంట్లో పుట్టినరోజు వేడుకలు వివాహ వార్షికోత్సవాల సందర్భంగా మొక్కలు నాటాలని సూచించారు

మర్రిపూడి మండల అధ్యక్షులు వాకా వెంకటరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరు తోడ్పడాలి. లేకపోతే భవిష్యత్ తరాలకు అంధకారమే మిగులుతుందని తెలిపారు. ఇందులో భాగంగా కళాశాల ప్రాంగణమును అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు.

పొదిలి వాకర్స్ అసోసియేషన్ వారిని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక పొదిలి డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి డి చంద్రశేఖర్,దేవ ప్రసాద్,కళ్ళం సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి , వాకా సుబ్బారెడ్డి, మీగడ ఈశ్వర్ రెడ్డి , సిఐటియు నాయకులు ఏం రమేష్, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్ హై, హబిబుల్లా పౌండేషన్ చైర్మన్ కరీముల్లా బెగ్, సయ్యద్ ఖలీల్, హాసన్ వలి, బాదం రఘురామిరెడ్డి, పమిడి వెంకటేశ్వర్లు, చిమట సుబ్బారెడ్డి, తాతిరెడ్డి చలమారెడ్డి, సిసికెఆర్ శ్రీనివాస రెడ్డి, కలశం అంజిరెడ్డి, ముల్లా జాకీర్, షేక్ మదార్ వలి, షేక్ మూసా జాని, రామారావు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు