పొదిలి గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా మారుస్తూ రాష్ట్రప్రభుత్వం ఆమోదం

పొదిలి మేజర్ గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

వివరాల్లోకి వెళితే రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రాష్ట్రం మొత్తంమీద 50మేజర్ గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు కావలసిన ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే అందులో పొదిలి కూడా ఒకటి……

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు 50 నగర పంచాయతీ లల్లో వేటపాలెం మీనహ మిగతా 49 నగర పంచాయతీ చేస్తూ శనివారం నాడు నిర్ణయం తీసుకుంది సమాచారం అందులో భాగంగా పొదిలి, కంభాలపాడు, నందిపాలెం, మాదాలవారిపాలెం గ్రామ పంచాయతీలను కలుపుతూ పొదిలికి నగర పంచాయతీ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారంనాడు ఆమోదం తెలిపింది……

ఇదే జరిగితే ఇప్పటి వరకు గ్రామ పంచాయతీగా ఉంటుందనుకున్న పొదిలి గ్రామ పంచాయతీ నగర పంచాయతీ ఆమోదం పొందడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపిపి, జడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించి ఖరారైన రిజర్వేషన్లు పొదిలి, కంభాలపాడు, నందిపాలెం, మాదాలవారిపాలెం గ్రామాలకు రద్దవడంతో ఇప్పటికే పార్టీ నేతలు, మిత్రులతో మంతనాలు సంప్రదింపులు జరుపుకున్న ఆశావహులకు చుక్కెదురైందనే చెప్పుకోవచ్చు.

సంబంధించిన పూర్తి వివరాలతో ఒకటి లేక రెండు రోజుల్లో ప్రభుత్వం జీవో విడుదలయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.