మేకల దొంగలకు దేహశుద్ధి పోలీసులకు అప్పగింత

పొదిలి పట్టణంలో బాప్టిస్ట్ పాలెం నందు మేకల దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినా సంఘటన గురువారం నాడు చోటుచేసుకుంది.

పొదిలి పట్టణం బాప్టిస్ట్ పాలెం చెందిన‌ యేసేబు తన మేకలు తరుచు పొతుండటంతో గతంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తారు
ఈ రోజు తన మేకలను దొంగలించి బలవంతంగా ఆటో ఎక్కి ఇస్తుండగా చూసినా నేను గ్రామస్తుల సహకారం తో ముగ్గురు దొంగలు పట్టుకొని దేహశుద్ధి చేశారు

గత రెండు నెలలుగా తనివి 20 మేకలు పోయావని తన జీవనాధారం మేక లేకపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందినని అన్నారు.

ఇన్ని రోజులకు దొంగల దొరకటంతో దొంగలను దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు

ప్రాథమికంగా ఈ దొంగలు ఒంగోలు ప్రాంతం చెందినవారని రోడ్డుపై కనపడిన మూగజీవాలను ఎత్తుకెళ్లి మరోచోట అమ్ముతుంటారని అలాంటివారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు