పొదిలిపట్టణంలో దొంగతనం బంగారం వెండి నగదు చోరీ
పొదిలి పట్టణం విశ్వనాథపురం రెండోవ లైన్ చివర నివాసగృహంలో దొంగతనం సంఘటన బుధవారం నాడు వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు చోరీ జరిగిన నివాస గృహంలో అద్దెకు ఉంటున్న పాస్టర్ రాజశేఖర్ తన సొంత ఊరుకు వెళ్లటం జరిగింది.
బుధవారం ఉదయం స్థానికంగా నివాసం ఉంటున్న మీత్రుడు తలుపు తీసి ఉన్నట్లు గమనించి వెళ్లి చూడగా దొంగతనం సంఘటన జరిగినట్లు గుర్తించి సదరు గృహంలో అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్న పాస్టర్ రాజశేఖర్ కు మరియు పోలీసులకు సమాచారం అందించారు.
65 గ్రాముల బంగారం 10 తులాల వెండి 32 వేల రూపాయల నగదు చోరీ కి గురైనట్లు పాస్టర్ రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటన స్థలాన్ని పొదిలి యస్ఐ సురేష్ సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు