నివాస గృహంలో బంగారం వెండి నగదు చోరీ
పొదిలి పట్టణం అచ్చిరెడ్డి నగర్ లోని ఒక నివాస గృహం నందు బంగారం నగదు చోరీ జరిగింది.
వివరాల్లోకి వెళితే పొదిలి నగర పంచాయితీ 12 వార్డు అచ్చిరెడ్డి నగర్ నందు ఇంటి కి తాళాలు వేసి ఉన్న నివాస గృహాన్ని లక్ష్యంగా చేసుకొని దొంగతనానికి పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
సదరు నివాస గృహ యజమానురాలు నరసమ్మ తన అత్త గారి అనారోగ్యంగా ఉండటంతో వైద్యశాల నందు పరీక్షలు చేయించి శుక్రవారం రాత్రి ఓబులక్కపల్లి గ్రామంలోని అత్త గారి ఇంటి లోనే ఉండి
శనివారం ఉదయం ఇంటి వచ్చి చూడగానే ఇంటి లో దొంగతనం సంఘటన జరిగినట్లు గుర్తించి వెంటనే పొదిలి పోలీసు స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై రంగంలో దిగిన యస్ఐ సురేష్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు.
సంబంధించిన చోరీ సంఘటన పై క్లూస్ టీం కు సమాచారం అందించి క్లూస్ టీం ను హుటాహుటిన రంగంలోకి దించి చోరీ జరిగిన నివాస గృహంలో వేలిముద్రలను ఇతర క్లూస్ ను సేకరించారు.
సంఘటన స్థలాన్ని పొదిలి సిఐ సుధాకర్ రావు సందర్శించి చోరీ జరిగిన తీరును పరిశీలించాలి యస్ఐ సురేష్ కు పలు సూచనలు చేసి అనంతరం గృహ యజమానురాలు నరసమ్మ మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం 2 లక్షల విలువైన బంగారం, 10 వేలు విలువచేసే వెండి 20 వేల రూపాయల నగదు చోరీ జరిగినట్లు తెలిపారు