తిరుమలలోని గొల్ల మండపాన్ని తొలగిస్తే ఉద్యమం తప్పదు అఖిల భారత యాదవ మహాసభ
తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గొల్ల మండపాన్ని తొలగిస్తే ఉద్యమం తప్పదని అఖిల భారత యాదవ మహాసభ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వివరాల్లోకి వెళితే మంగళవారంనాడు స్థానిక యాదవ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్ మాట్లాడుతూ గొల్ల మండపం బలహీనంగా ఉందనే సాకుతో తరలించే యోచనను తిరుమల తిరుపతి దేవస్థాన పాలకవర్గం మానుకోవాలని ఉన్న ప్రదేశంలోనే పునర్నిర్మాణం చేయాలని అలా కాకుండా యాదవుల మనోభావాలు దెబ్బతినే విధంగా చారిత్రాత్మకమైన గొల్ల మండపాన్ని తొలగించే యోచనను విరమించుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యాదవ్ మహాసభ నాయకులు కనకం వెంకట్రావు యాదవ్, మువ్వ కాటమరాజు,శ్రీనివాస్ యాదవ్ , పెమ్మని రాజు, సన్నెబోయిన రాంబాబు, బోగాని సుబ్బారావు, బలగాని నాగరాజు, రాజు, తదితరులు పాల్గొన్నారు.