భక్తిశ్రద్ధలతో శుభ శుక్రవారం వేడుకలు

పొదిలి పట్టణంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆర్ సి ఎం చర్చి అలాగే వివిధ చర్చిలలో ఈస్టర్ పర్వదినాన్ని శుక్రవారం గుడ్ ఫ్రైడే గా ఘనంగా నిర్వహించారు. 2018 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు శిలువ వేయబడిన విధానాన్ని శిలువ యాత్రగా విశ్వనాథపురం నుండి మార్కపురం క్రాస్ రోడ్ ఆర్ సి ఎం చర్చి వరకు ప్రదర్శించారు. అనంతరం చర్చి లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఫాస్టర్ మార్టిన్ తదితరులు పాల్గొన్నారు