ఆంగ్ల ఉపాధ్యాయుల ప్రత్యేక బదిలీని నిరసిస్తూ విద్యార్థుల రాస్తారోకో
ఆంగ్ల ఉపాధ్యాయుల ప్రత్యేక బదిలీని నిరసిస్తూ ఒంగోలు-కర్నూలు రాష్ట్ర రహదారిపై విద్యార్థులు రాస్తారోకో చేసిన సంఘటన బుధవారంనాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల నందు ఆంగ్ల విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయులను ప్రత్యేక బదిలీపై వెళ్లడంతో ఆంగ్ల విద్య బోధించేవారు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందంటూ ఒంగోలు-కర్నూలు రహదారిపై భైఠాయించి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఆంగ్ల బోధనకు సిద్ధమైన సమయంలో మాకు ఆంగ్లం బోధించడానికి ఉన్న ఒకే ఉపాధ్యాయులును ప్రత్యేక బదిలీ పేరుతో బదిలీ చేసి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆంగ్ల ఉపాధ్యాయులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.