సర్పంచ్ ఆధ్వర్యంలో ఆమదాలపల్లిలో గ్రామ సభ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండలం ఆమదాలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గాంధీ చిత్రపటానికి సర్పంచ్ సిరిమల్లె శ్రీనివాస్ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయం నందు పంచాయతీ సర్పంచ్ శిరిమల్లె శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతనతో గ్రామ సభ నిర్వహించారు.
ప్రజల నుంచి వచ్చిన పలు వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గ్రామ సభ కు వినతులను శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్ళి
అభివృద్ధి పనులకు శ్రీకారం చూడతామని ఆయన తెలిపారు
ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది మరియు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు