వాలంటీర్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది : శాసనసభ్యులు కుందూరు
గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి అన్నారు.
ఇంటికి వచ్చి దూషించి మేము చెప్పినట్లు దరఖాస్తులు పెట్టాలని బెదిరింపులకు పాల్పడుతూ మాపై ఒత్తిడి చేస్తున్నారని పొదిలి గ్రామ పంచాయతీ పిఎన్ఆర్ కాలనీ చెందిన మహిళా గ్రామ వాలంటీర్ల సోమవారంనాడు మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయానికి విచ్చేసిన మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డికి వినతిపత్రాన్ని అందజేసి వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా వాలంటీర్లు కన్నీటి పర్యంతమయ్యారు.
మహిళా వాలంటీర్లు మనోవేదనకు చలించిన శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి విచారణ జరిపి న్యాయం చేస్తానని వాలంటీర్లు అధైర్య పడవలసిన అవసరం లేదని మీకు పూర్తిగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.