గ్రామ వాలంటీర్ల తుది జాబితా విడుదల
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన ఎంపికైన గ్రామ వాలంటీర్ల తుది జాబితాను విడుదల చేసారు. వివరాలు లోకి వెళితే పొదిలి మండలంకు సంబంధించి మొత్తం 334 మందితో కూడిన తుది జాబితాను శనివారం నాడు విడుదల చేయగా అందులో యస్టీ 7 యస్సీ 77 బిసి 130 ఓపన్ 130 వీరిలో మహిళలు 175 మందిని పురుషులను 169 మందిని ఎంపిక చేసినా జాబితాను మండల పరిషత్ కార్యలయంలో నోటీసు బోర్డు లో పెట్టారు