ప్రారంభమైన రెవెన్యూ రికార్డుల స్వచ్చీకరణ గ్రామసభలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల క్రమబద్ధీకరణలో భాగంగా రెవెన్యూ రికార్డుల స్వచ్చీకరణ గ్రామ సభలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆదేశాలు మేరకు గురువారంనాడు స్ధానిక రామాయణకండ్రిక గ్రామంలో గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామంలో మొత్తం 89 సర్వే నంబర్లకు గాను గుడికట్టు విస్తీర్ణం 771.25ఎకరాలు కాగా రికార్డుల దాఖలు 772.13 ఎకరాలు, వ్యత్యాసం 88సెంట్లు ఉందని….. అదేవిధంగా పాస్ బుక్ ఖాతానంబర్ కల్గినవారు 67మంది చనిపోగా ఆధార్ అనుసంధానం కాని వారు 12మంది ఉన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు, విఆర్ఓ వెంకటరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.