గ్రామ సచివాలయలను సందర్శించిన సిఐ శ్రీరామ్

పట్టణంలోని గ్రామ సచివాలయాలను పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ సందర్శించారు.

వివరాల్లోకి వెళితే బుధవారంనాడు పొదిలి పట్టణంలోని సచివాలయాలను సందర్శించిన సందర్భంగా పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పొదిలి ఎస్ఐ సురేష్, పంచాయతీ కార్యదర్శి బ్రహ్మనాయుడు, గ్రామ పంచాయతీ మరియు గ్రామ సచివాలయాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.