గ్రామ వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ తరగతి
గ్రామ వాలంటీర్ల విధులకు సంబంధించిన శిక్షణ తరగతిని శనివారం నాడు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే గ్రామ వాలంటీర్లు వారు నిర్వహించే విధులకు సంబంధించిన శిక్షణ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారంనాడు నిర్వహించిన అధికారులు….. వాలంటీర్ల విధి నిర్వహణకు వారికి కేటాయించిన వార్డులలోని ఇళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం తెలిసి ఉండాలని సూచిస్తూ వారికి కేటాయించిన ఇళ్ల జాబితా తయారు చేసుకునే విధంగా శిక్షణ ఇచ్చి…. ఇంటి సమాచారానికి సంబంధించిన దీపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, మండల పరిషత్ ప్రత్యేక అధికారి బెనహరన్, పంచాయతీ రాజ్ విస్తరణ అధికారి రాజశేఖర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.