గ్రామ వాలంటీర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామ వాలంటీర్లకు గుర్తింపు కార్డులను జారీ చేశారు.
స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం మండల పరిషత్ కార్యాలయ మీటింగ్ హాల్ నందు సమావేశం ఏర్పాటు చేసి వాలంటీర్ల విధివిధానాలు సూచించారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ వాలంటీర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు.