పొదిలిలో ముగిసిన నివేశన స్థలాల గ్రామసభ

పొదిలిలో ఇంటి నివేశన స్థలాల గ్రామసభ శుక్రవారంనాడు ముగిసింది.

వివరాల్లోకి వెళితే స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంటి నివేశన స్థలాల గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ రెవిన్యూ అధికారి శివారెడ్డి మాట్లాడుతూ ఇంటి నివేశన స్థలాల కొరకు మొత్తం 2196మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 2004మంది అర్హులుగా గుర్తించిన వారి పేర్లు జాబితాలో రావడం జరిగిందని….. జాబితాలో ఉన్న వారికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని….. అలాగే అర్హులై ఉండి జాబితాలో పేర్లు లేనియెడల వారియొక్క దరఖాస్తులను స్థానిక మండల రెవిన్యూ కార్యాలయంలో కానీ పంచాయతీ కార్యాలయంలో కానీ 18, 19, 20వతేదీలలో దరఖాస్తులను అందజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నక్కా బ్రహ్మనాయుడు, సానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.