ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

అజాద్ కి అమృత మహోత్సవ వేడుకల్లో భాగంగా భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 146 వి జయంతి వేడుకలు పొదిలి,మర్రిపూడి,కొనకనమిట్ల మండలాల్లో ఘనంగా జరిగాయి.

స్థానిక పొదిలి నగర పంచాయితీ కార్యాలయం నందు పింగళి వెంకయ్య, బళ్లారి రాఘవ చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, వార్డు కార్యదర్శి శ్రీకాంత్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేంద్ర మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మర్రిపూడిలో

మర్రిపూడి మండల పరిషత్ కార్యాలయం నందు పింగళి వెంకయ్య బళ్లారి రాఘవ చిత్రపటాలకు మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట్ రెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జి విజయలక్ష్మి మండల పరిషత్ అభివృద్ధి అధికారి షేక్ ఖాశీం పీరా,  ఈఓఆర్డీ రాజశేఖర్, సీనియర్ అసిస్టెంట్  నాగూర్ వలి, టైపిస్టు సుల్తాన్ బాష,  రమణారెడ్డి కొండలరావు మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.