ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు
పొదిలి మున్సిపల్ పరిధిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు షేక్ నూర్జహాన్ ఆధ్వర్యంలో శుక్రవారం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
స్థానిక విశ్వనాథపురం లోని వైయస్సార్ విగ్రహానికి పట్టణ అధ్యక్షులు షేక్ నూర్జహాన్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి కోసి కార్యకర్తలకు పంచి పెట్టారు అనంతరం పులిహోర ను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట్ రెడ్డి, పొదిలి మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు జి శ్రీనివాసులు, పట్టణ ప్రధాన కార్యదర్శి గొలమారి చెన్నారెడ్డి కార్యదర్శి కల్లం వెంకట సుబ్బారెడ్డి మరియు బూత్ కమిటీ కన్వీనర్లు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు