ఘనంగా ఓటర్ల దినోత్సవ పోటీలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు పొదిలి మండల స్థాయి వ్యాస‌ రచనా వకృత పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించారు.

వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి షారోనురాణీ, ద్వితీయ బహుమతి సాయి దీక్షత తృతీయ బహుమతి ప్రసన్న వక్తృత్వ పోటీల్లో ప్రథమ బహుమతి సుమయ ద్వితీయ బహుమతి షేక్ మాహీన్, తృతీయ బహుమతి సాయి దీక్షత క్విజ్ పోటీల్లో ప్రథమ బహుమతి సాహితీ, సహ్రస, నిరుపమ తేజ్ లు ఎంపికయ్యారు

ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దార్ వెంకట కృష్ణారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి, జూనియర్ కళాశాల అదనపు ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, ఆర్ఐ సుబ్బారావు పోటీలకు న్యాయ నిర్ణేతలు వ్యవహరించిన మోహన్ కృష్ణ, మల్లిఖార్జున రావు,రమణ రెడ్డి పద్మావతి మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు