గ్రీన్ జోన్ గా పొదిలి: తహశీల్దారు ప్రభాకరరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పొదిలి మండలాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారని మండల రెవెన్యూ తహశీల్దారు ప్రభాకరరావు ఒక ప్రకటన విడుదల చేశారు.
వివరాల్లోకి వెళితే బుధవారంనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ జిల్లాలో ఒంగోలు, చీరాల, కారంచేడు మూడు మండలాలను రెడ్ జోన్ పరిధిలో గుడ్లురు, కందుకూరు, కనిగిరి,కొనకనమిట్ల, మార్కాపురం, చీమకుర్తి, కొరిశపాడు మండలలాను ఆరెంజ్ జోన్లుగా మిగత 46 మండలాలను గ్రీన్ జోన్ పరిధిలో తీసుకునివస్తూ జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ బుధవారంనాడు ఆదేశాలు జారీ చేశారని తహశీల్దారు ప్రభాకరరావు తెలిపారు.