ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 4 పరీక్షలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన గ్రూప్ 4 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
ఆదివారం నాడు స్థానిక పొదిలి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వం జూనియర్ కళాశాల, ప్రభుత్వం ఉన్నత పాఠశాల,కంబాలపాడు బెల్లంకొండ విద్యా సంస్థ నందు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక యస్ఐ మరో ఆరు మంది సిబ్బందిని బందోబస్తును ఏర్పాటు చేసామని పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ యు సుధాకర్ రావు తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద యస్ఐలు శ్రీహరి, ఫణీ కుమార్, వూదుద్, దరిశి తహశీల్దారు ఆకుల రవి శంకర్ తదితరులు విధులు నిర్వహించారు