గునుపూడి చెంచయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో అంగన్ వాడీ పిల్లలకు యూనిఫాం పంపిణీ
గునుపూడి చెంచయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో అంగన్ వాడీ కేంద్రాలలోని పిల్లలకు యూనిఫాంలను ఈ కార్యక్రమ ముఖ్య అతిధి మహిళా శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పాతకోట సరోజిని చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం స్ధానిక మండల పరిషత్ కార్యలయ సమావేశ మందిరంలో ఆదివారం నాడు జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గునుపూడి చెంచయ్య ట్రస్ట్ పేరుతో కుమారుడు గునుపూడి మధు యూనిఫాంలను పంపిణీ చేయటం
ద్వారా తనలో తన తండ్రిపై గల మమకారం అర్ధమవుతుంది అని ఇంకా ఇలాంటి మరో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు గునుపూడి భాస్కర్, గునుపూడి మధుసూదనరావు, ఐసిడిఎస్ అధికారిణి కృష్ణవేణి, ఎంఇఓ రఘురామయ్య , అంగన్ వాడీ సంఘం నాయకురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.