అధిష్టానం ఆదేశిస్తే సర్పంచ్ గా పోటీకి సిద్ధం………. : పొదిలిటైమ్స్ ప్రతినిధితో గునుపూడి

రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే పొదిలి గ్రామ పంచాయతీనుండి సర్పంచ్ గా పోటీ చేస్తానని గునుపూడి భాస్కర్ అన్నారు. స్థానిక చిన్నబస్టాండ్ లోని గునుపూడి భాస్కర్ సోదరుని గృహంలో పొదిలి టైమ్స్ ప్రతినిధి నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని గునుపూడి భాస్కర్ అన్నారు. పొదిలి పంచాయతీలో అన్ని వర్గాల మద్దతు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ స్థాపించినప్పటి నుండి తమ కుటుంబం టీడీపీలోనే ఉన్నామని రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటినుండి టీడీపీలోనే ఉన్నాకుడా ఇప్పటివరకు తగిన అవకాశాలు రాలేదని ఇప్పుడు మాత్రం ప్రజల అభీష్టం మేరకు పార్టీ అధిష్టానం అలాగే కందుల నారాయణరెడ్డి ఆదేశిస్తే పోటీకి చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అలాగే పార్టీ అధిష్టానం ఈసారి సర్పంచ్ గా పోటీ చేయడానికి తనకు అవకాశం కల్పించే వీలుందని బలంగా విశ్వసిస్తున్నానని పొదిలిటైమ్స్ ప్రతినిధికి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ జిలాని పాల్గొన్నారు.