జన విజ్ఞాన వేదిక జండా ఆవిష్కరించిన గురుస్వామి
జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పొదిలి డివిజన్ జెవివి అధ్యక్షులు దాసరి గురుస్వామి జెండాను ఆవిష్కరించారు.
వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జెండా ఆవిష్కరణ అనంతరం గురుస్వామి మాట్లాడుతూ 1988ఫిబ్రవరి 28న జన విజ్ఞాన వేదిక ఆవిర్భవించి ప్రజలలో శాస్త్రీయ దృక్పథం, విద్య ,ఆరోగ్యం, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు మూఢనమ్మకాలు నిర్మూలన కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జె వి వి ప్రధాన కార్యదర్శి బి దేవ ప్రసాద్, గంజి రమణారెడ్డి, కె మస్తానయ్య, రాజేశ్వరరావు గోనె శీను, బాలకాశి రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు నాసర్ అహ్మద్, మదార్ వలి, చౌదరి, ఎం వి శ్రీనివాసులు, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.