ప్రతిభా పురస్కారాలు అందజేసిన న్యాయమూర్తి రాఘవేంద్ర
విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను పొదిలి న్యాయస్థానం న్యాయమూర్తి రాఘవేంద్ర చేతుల మీదుగా పంపిణీ చేశారు.
వివరాల్లోకి వెళితే శనివారంనాడు స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు హబీబుల్లా బేగ్ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక న్యాయస్థానం న్యాయమూర్తి రాఘవేంద్ర పలువురు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు మరియు ఎంపిక చేసిన విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు ముందుండి నడిపిస్తున్న సంస్థ నిర్వాహకులను అభినందిచారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటరామయ్య, కరిముల్లా బేగ్, షేక్ మదార్ వలి, వీరారెడ్డి, కల్లం వెంకట సుబ్బారెడ్డి, బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.