హాబీబుల్లా ఫౌండేషన్ సేవాలు స్పూర్తిదాయకంగా – శాసనసభ్యులు కుందూరు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

హాబీబుల్లా ఫౌండేషన్ సేవాలు స్పూర్తిదాయకమని శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.

శుక్రవారం నాడు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపాల్ తారావాణీ అధ్యక్షతనతో హాబీబుల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 135 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం హాబీబుల్లా ఫౌండేషన్ సౌజన్యంతో 20 మంది విద్యార్థులు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ సుధాకర్ రావు, డియల్పీఓ నాగేశ్వరరావు,పొదిలి,మర్రిపూడి మండలాల చెందిన విద్యా శాఖ అధికారులు శ్రీనివాసులు రెడ్డి,ఈవి రంగయ్య ,ఆంధ్ర ప్రగతి బ్యాంకు మేనేజర్ సునీల్ గుప్తా, యల్ఐసీ మేనేజర్ వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు