హాబీబుల్లా ఫౌండేషన్ సేవలు మరువలేనివి: ఎంఇఓ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

హాబీబుల్లా ఫౌండేషన్ సేవలు మరువలేనివి అని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి అన్నారు .

మంగళవారం నాడు స్థానిక పొదిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ఉర్దూ పాఠశాల నందు ఏర్పాటు చేసిన మాతృభాష దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరిముల్లా బేగ్ చేతుల మీదుగా పాఠశాలలోని విద్యార్థులకు పోటీలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు అందించారు.

ఈసందర్బంగా పలువురు మాట్లాడుతూ ఉర్దూ భాష ను గురించి, భాష యొక్క ప్రాముఖ్యత గురించి, విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు హబీబుల్లా ఫౌండేషన్ సౌజన్యంతో దుప్పట్లు మరియు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి యం శ్రీనివాసులు, ఉర్దూ డి ఐ హాబీబుల్లా, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి,ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమరుల్లా ఖాన్, ఉపాధ్యాయరాలు మొగల్ షబ్రన్నీసా బేగం, మదర్సా అధ్యక్షులు రబ్బానీ మౌలానా , ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు