వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

పొదిలి పట్టణం నందు వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు.

బుధవారం నాడు స్థానిక పొదిలి పట్టణంలోని ప్రసన్నాంజనేయ స్వామి , ఆంజనేయ స్వామి దేవాలయం, విశ్వనాధపురంలో ఆంజనేయ స్వామి దేవాలయం, కాటూరి వారి పాలెం లోని ఆంజనేయ స్వామి దేవాలయం, దర్గ వద్ద ఉన్న ఆంజనేయస్వామి పీఠం దగ్గర హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తెల్లవారుజామున నుంచి భక్తులు దేవస్థానం నందు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకుని తీర్థప్రసాదాలు పొందారు.

అనంతరం ప్రతి దేవస్థానం వద్ద అన్నప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించారు