యస్ఇబి అధికారులు దాడుల్లో భారీగా గోవా మద్యం పట్టివేత
పొదిలి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ అధికారులు దాడుల్లో పెద్ద ఎత్తున గోవా రాష్ట్రానికి చెందిన మద్యం పట్టివేత సంఘటన బుధవారం నాడు చోటుచేసుకుంది.
పొదిలి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ అధికారులు వరుస దాడులతో అక్రమ మద్యం పట్టివేతల్లో భాగంగా నిన్న కొనకనమీట్ల మండలం గొట్లగట్టు గ్రామంలో దాడి చేసి తెలంగాణాకు చెందిన మద్యం భారీగా పట్టివేత తరువాత మరోసారి వచ్చిన సమాచారం మేరకు బుధవారం నాడు స్థానిక గొట్లగట్టు గ్రామంలో ఒక నివాసం గృహంలో తనిఖీలు చేపట్టాగా అక్కడ గోవా చెందిన మద్యం బాటిల్స్ భారీగా పట్టుకొని సంబంధించిన మద్యం బాటిల్స్ ను పొదిలి యస్ఇబి స్టేషన్ తరలించి అనంతరం విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పొదిలి యస్ఇబి యస్ఐ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు తమ సిబ్బందితో గొట్లగట్టు గ్రామంలోని నివాసం గృహంలో తనిఖీలు చేపట్టాగా అక్కడ 33 కేసులు రాయల్ స్టాక్,10 కేసులు మ్యాన్షన్ హౌస్ బ్రాందీ, 1 కేసు ఇంపీరియల్ బ్లూ మొత్తం 44 కేసుల మద్యం పట్టివేసి ఇద్దరు పై కేసు నమోదు చేసామని నిందితులు పరారీలో ఉన్నారు తెలిపారు.
ఎవరైనా అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ దాడిలో కానిస్టేబుల్ వెంకట్రావు, కానిస్టేబుళ్ళు షేక్ బాజి సయ్యద్,పి.వెంకటేశ్వర్లు,సత్యనారాయణ, గురవయ్య , పొదిలి యస్ఇబి స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు