పదవీవిరమణ సందర్భంగా చిరకాల కోరిక తీర్చుకున్న టీచర్ దంపతులు
ఆ టీచర్ కు చిరకాల కోరికగా మిగిలిపోయిన కల హెలికాప్టర్ లో ప్రయాణం చేయాలని… అయితే ఆ కలను సాధ్యం చేసుకుంటూ పదవీవిరమణ రోజునే హెలికాప్టర్ లో ప్రయాణం చేసి వారి కోరికను తీర్చుకున్నారు ఆ టీచర్ దంపతులు.
వివరాల్లోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రంలో ఆగష్టు 31తేదీ పదవీవిరమణ చేసిన రమేష్ చంద్ మీనా వారి చిరాకాల కోరిక అయినా హెలికాప్టర్ ప్రయాణం కోరికగానే మిగిలిపోకూడదని…. వారి కోరికను తీర్చుకునేందుకు ముందే ఒక పక్కా ప్రణాళికతో ఒక ప్రైవేటు సంస్థతో హెలికాప్టర్ ను అద్దెకు ఒప్పందం కుదుర్చుకుని పదవీవిరమణ కార్యక్రమం ముగిసిన వెంటనే హెలికాప్టర్ లో పాఠశాల నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే తన స్వగ్రామానికి వెళ్ళే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని….. అనుకున్న విధంగానే పదవీవిరమణ చేసిన వెంటనే తన శ్రీమతితో కలిసి హెలికాప్టర్ ఎక్కి ప్రయాణం చేసి తన కోరికను తీర్చుకున్నాడు ఆ టీచర్.
అయితే ఈ సంఘటన మాత్రం దేశ వ్యాప్తంగా వైరల్ అయింది.