పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నవంబర్ 11వ తేదిన హైదరాబాద్ లో జరిగే మాదిగ విశ్వరూప మహాసభ గోడ పత్రికను స్థానిక బాప్టిస్ట్ పాలెం నందు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మండల కన్వీనర్ వెల్పుల సురేష్ మాట్లాడుతూ యస్సీ వర్గీకరణ కోసం తలపెట్టిన మాదిగ విశ్వరూప మహాసభ లో ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారని కావున పెద్ద ఎత్తున మాదిగ ఉద్యోగస్తులు, మాదిక విద్యార్థులు, మాదిగ యువత మాదిగ ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.