హై రిస్క్ రెడ్ జోన్ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ
పొదిలి పట్టణంలోని పెద్ద బస్టాండ్ నుండి చిన్న బస్టాండ్ వరకు ఇరువైపులా హై రిస్క్ రెడ్ జోన్ గా ప్రకటిస్తూ మండల రెవిన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు అధ్యక్షతన మండల టాస్క్ ఫోర్స్ కమిటీ శనివారం నిర్ణయం తీసుకుంది.
టాస్క్ ఫోర్స్ కమిటీ ఆదేశాలు మేరకు యస్ఐ సురేష్ ఆధ్వర్యంలో హై రిస్క్ రెడ్ జోన్ పరిధిని పూర్తిగా పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లను మండల రెవెన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు పరిశీలించారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ పొదిలిటైమ్స్ తో మాట్లాడుతూ వచ్చే శనివారం వరకు పట్టణంలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ కొనసాగుతుందని అదేవిధంగా హై రిస్క్ జోన్ నందు మెడికల్ షాపులతో సహా అన్ని వ్యాపార సంస్ధలు బంద్ అని నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం కేవలం పెద్ద బస్టాండ్ వంతెన నుండి విశ్వనాథపురం వరకు ఉదయం 6గంటల నుండి 9వరకు మాత్రమే అవకాశం ఇచ్చామని తెలిపారు.