ఇంటి స్థలాలు కేటాయించాలని తహశీల్దారుకు వినతిపత్రం అందజేసిన హోంగార్డులు
ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుతూ పొదిలి మండల తహశీల్దార్ ప్రభాకరరావుకు హోంగార్డులు వినతిపత్రాన్ని అందజేశారు.
వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జిఓ ఎంయస్ నెంబర్ 77ప్రకారం ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలాలు మరియు ఇంటి నిర్మాణం రాయితీలను హోంగార్డులకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారని…..
ప్రభుత్వం ఆదేశాలు మేరకు హోంగార్డులకు ఇంటి స్థలాలు కేటాయించాలని వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని…. తహశీల్దారు ప్రభాకరరావు స్పందిస్తూ తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు హోంగార్డు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో షేక్ గౌస్ (గాంధీ), చావలి రవీంద్ర యాదవ్, కనకారావు, చాంద్ బాషా, రంగస్వామి, రామకృష్ణ, రమేష్, సలీమ్, సుబ్బులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.