అమరవీరుల భౌతికకాయాలను స్వస్థలాలకు తరలించిన కేంద్ర హోంమంత్రి
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో గురువారం నాడు జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల భౌతికకాయాలను కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ పుల్వామా నుండి వారి వారి స్వస్థలాలకు తరలించారు. తొలుత గాయపడిన జవాన్లను వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం భౌతికకాయాలను సందర్శించిన ఆయన భౌతికకాయాలను ఎత్తుకుని మిలటరీ ప్రత్యేక వాహనంలో జవాన్ల స్వస్థలాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా జమ్మూకాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, హోం సెక్రెటరీ రాజీవ్ గౌబా, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్ ఆర్ భట్నాగర్, జమ్మూకాశ్మీర్ డిజీపీ దిల్ బాగ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.