హోండా యాక్టివా బియస్6 నూతన వాహనం ఆవిష్కరణ
హోండా యాక్టివా బియస్6 నూతన మోడల్ వాహనాన్ని జిల్లా సిఇఓ మాదాల గౌతమ్ ఆవిష్కరించారు.
వివరాల్లోకి వెళితే స్ధానిక హోండా షోరూం నందు గురువారంనాడు భారతీయ అత్యాధునిక ప్రమాణాలు కలిగిన బియస్6 హొండా యాక్టివా నూతన మోడల్ వాహన ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఇఓ మాదాల గౌతమ్ పొదిలిటైమ్స్ తో మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిగా అత్యాధునిక ప్రమాణాలు కలిగిన ద్విచక్ర వాహనాన్ని హోండా కంపెనీ బియస్6 యాక్టివా 125ను మార్కెట్ లోకి తెచ్చామని కారులో ఉండేటువంటి సెన్సార్ సిస్టమ్ ఉందని…..
గతంలో రెండు సంవత్సరాలు వారంటీ ఉంటే ప్రస్తుతం మూడు సంవత్సరాలు వారంటీ ఉందని…. గతంలో 45నుండి 50కిలోమీటర్ల మైలేజ్ వచ్చే యాక్టీవా వాహనం ప్రస్తుతం 62కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని….. గతంలో సంవత్సరానికి నాలుగు సార్లు సర్వీసింగ్ చేయవలసి వచ్చేదని ప్రస్తుతం బిఎస్ 6 వాహనాలు 2సార్లు సర్వీసింగ్ చేస్తే సరిపోతుందని…. అదేవిధంగా ఈ వాహనం నాలుగు రంగులలో మూడు వేరియంట్ లలో లభిస్తుందని….. ఇది పూర్తిగా శబ్దంరహితంగా ఉంటుందని దాని వలన ఎలాంటి శబ్దం కాలుష్యం ఉండదని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో షరాబు సత్యనారాయణ, దీపు, షోరూం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.